: పక్షులకూ ఓ చలివేంద్రం!... కాకినాడలో ఎన్జీవో వినూత్న ఏర్పాటు!
ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపానికి భయపడి జనం బయటకు వచ్చేందుకు బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు వందల సంఖ్యలో నమోదయ్యాయి. ఎండ వేడిమి నుంచి జనానికి ఉపశమనం కోసం ఎక్కడికక్కడ చలి వేంద్రాలు ఏర్పాటయ్యాయి. నెల్లూరులో టీడీపీకి చెందిన ఓ నేత వినూత్నంగా తాటి ముంజలను ఉచితంగా పంపిణీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఓ స్వచ్ఛంద సంస్థ మరో వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది. ఎండ వేడిమితో జనంతో పాటు పశు పక్ష్యాదులకు కూడా ఇబ్బందే కదా అంటూ ఆ సంస్థ... పక్షుల కోసం ప్రత్యేకంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని బోట్స్ క్లబ్ లో ఓ పందిరి వేసిన ఆ సంస్థ... ఆ పందిరికి నీటి కుండలను కట్టి వాటిని నీటితో నింపింది.