: నా సహోద్యోగుల్ని హత్య చేయాలి...అవకాశం ఇవ్వండి: కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రులకు ఉద్యోగి లేఖ


విధుల్లో వేధింపులను తట్టుకోలేకపోయిన ఉద్యోగి, తన ఇద్దరు సహోద్యోగులు, మేనేజర్‌ ను హత్య చేయాలి అవకాశం ఇవ్వండంటూ కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే...చిత్రదుర్గ జిల్లాలో మోక్షకుమార్ అనే వ్యక్తి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నకిలీ రికార్డులు సృష్టించిన కేసులో మోక్షకుమార్‌ 8 నెలలుగా సస్పెన్షన్ లో ఉన్నారు. దీంతో ఆయనకు సగం జీతం మాత్రమే అందుతోంది. దీనిపై ఆగ్రహించిన మోక్షకుమార్, తనపై కక్షతో వేధింపులకు పాల్పడిన కేస్ వర్కర్లు సునీల్, శ్రీధర్ లతో పాటు మేనేజర్ చంద్రశేఖర్ ను హత్య చేయాలని ఉందని, అందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రికి లేఖలు రాశారు.

  • Loading...

More Telugu News