: ‘మద్యం, గుట్కా, సిగిరెట్ మానుకో నాన్న... అమ్మా...సారీ’ అంటూ యువకుడి సూసైడ్ నోట్


‘మద్యం, సిగిరెట్, గుట్కా మానుకో నాన్న’... ‘అమ్మా, సారీ’ అంటూ ఒక యువకుడు తన సూసైడ్ నోట్ లో రాసి, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్ లో ఈరోజు జరిగింది. సూరారానికి చెందిన విద్యార్థి సాయి అభినంద్(22) బీహెచ్ఈఎల్ లో అప్రెంటిస్ షిప్ చేస్తున్నాడు. బీహెచ్ఈఎల్ కు సమీపంలోని ఒక హాస్టల్ లో ఉంటున్నాడు. సాయి అభినంద్ తన హాస్టల్ గది నుంచి ఈరోజు బయటకు వెళ్లాడు. అతను వెళ్లిన చాలా సేపటి తర్వాత ఆ గదిలో ఉన్న అతని స్నేహితులు ఒక లెటర్ ను గమనించారు. అందులో ఏముందా? అని వారు తెరిచి చూడగా ‘నేను హాస్టల్ వెనుక భాగంలో ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని రాసి ఉంది. దాంతో వెంటనే స్పందించిన స్నేహితులు హాస్టల్ వెనుక భాగం వైపునకు వెళ్లి వెతికారు. ఒక గదిలో కాలిపోయిన మృతదేహాన్ని వారు గమనించారు. ఈ సమాచారాన్ని బీహెచ్ఈఎల్ అధికారులకు తెలియజేయడం.. సంఘటనా స్థలానికి ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి రావడం జరిగింది. ఈ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయి అభినంద్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేశారు. మృతుడి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, సాయి అభినంద్ గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి అభినంద్ తండ్రి పేరు వెంకటేశ్. వృత్తి రీత్యా డ్రైవర్ అని తెలిసింది.

  • Loading...

More Telugu News