: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ టీజర్ విడుదల


అగ్ర హీరోలు గతంలో నటించిన మూడు పాత్రలను బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అనుకరిస్తూ నటించిన ఆయన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. ఈ చిత్రానికి రోనాల్డ్స్ దర్శకత్వం వహించారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించిన నాటి చిత్రం ‘పెదరాయడు’ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు ఏ వేషధారణలో అయితే కనపడతారో అదే వేషధారణలో సంపూర్ణేష్ బాబు ఈ టీజర్ లో కనపడతాడు. కాగా, హృదయకాలేయం చిత్రం ద్వారా తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సంపూర్ణేష్ బాబును ‘సంపూ’గా అభిమానులు ముద్దుగా పిలుచుకోవడం తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News