: భారతీయులెవరూ లిబియా వెళ్లవద్దు: భారత్ ఆదేశం


అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న లిబియాకు భారతీయులెవరూ వెళ్లవద్దని భారత్ ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్రికా దేశమైన లిబియాలో గత కొంత కాలంగా ప్రభుత్వం, తిరుగుబాటు దారులకు మధ్య పోరాటం జరుగుతోంది. పరిపాలనే లక్ష్యంగా దాడులు చోటుచేసుకుంటుండడంతో ఆ దేశానికి భారతీయులు వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించిన భారత ప్రభుత్వం, తమ పౌరులను హెచ్చరించింది. భారత పౌరులెవరూ లిబియాకు వెళ్లవద్దని, లిబియా ప్రయాణాలు నిషేధిస్తున్నామని ప్రకటించింది. కల్నల్ గడాఫీ అంత్యదశలో ఉండగా చెలరేగిన అంతర్యుద్ధం తిరుగుబాటుదారుల విజయంతో ముగిసింది. తరువాత కొంత కాలానికే అక్కడ మళ్లీ తిరుగుబాట్లు మొదలయ్యాయి. దీంతో భద్రత కారణాల వల్ల భారత పౌరులు లిబియా వెళ్లడాన్ని నిషేధిస్తున్నామని, భారత పౌరులకు రక్షణ లేకుండా పోయిందని, భారతీయులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం ఈ ఆదేశాల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News