: సినీ పరిశ్రమలో మగాళ్లదే పైచేయి: బాలీవుడ్ నటి కాజోల్


సినీ పరిశ్రమలో మగవాళ్లదే పైచేయని ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ తన మనసులో మాట చెప్పింది. బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడైనా వాళ్లే ఆధిపత్యం చలాయిస్తున్నారని, సినీ పరిశ్రమలో మహిళలు, పురుషులు సమానమన్న ప్రసక్తే లేదని, ఆ విషయాన్ని దాచలేమని చెప్పింది. పెళ్లి, వయసు ఆ రెండూ తన కెరీర్ కు ఎప్పుడూ ఆటంకంగా నిలువలేదని పేర్కొంది. కాగా, గత ఏడాది ‘దిల్ వాలే’ చిత్రం ద్వారా కాజోల్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ భార్య అయిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News