: ఏయూ హాస్టల్ 'బార్'లో రిజిస్ట్రార్ తనిఖీలు...పలు రూములకు తాళాలు!
ఆంధ్రాయూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుండడంపై నెలకొన్న ఆందోళనలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీలోని స్కాలర్స్ కు కేటాయించిన జీఎంసీ బాలయోగి హాస్టల్ లో వసతి సౌకర్యం పొందుతున్న స్కాలర్స్ మద్యం తాగుతూ ఓ టీవీ ఛానెల్ కు చిక్కారు. ఆ విజువల్స్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో కదిలిన రిజిస్ట్రార్ హాస్టల్ ను బార్ గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వివిధ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అనధికారికంగా హాస్టల్ లో వసతి సౌకర్యం అనుభవిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వారిని బయటకు పంపి, ఆయా రూములకు తాళాలు వేశారు.