: కేరళలో డీజిల్ వాహనాలకు చెక్ చెప్పిన గ్రీన్ ట్రైబ్యునల్


కేరళలోని డీజిల్ వాహనాలకు గ్రీన్ ట్రైబ్యునల్ చెక్ చెప్పింది. రాష్ట్రంలోని నగరాల్లో పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలను నడపకూడదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. పదేళ్లు దాటి వినియోగంలో ఉన్న వాహనాలను వినియోగంలోంచి ఉపసంహరించేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. నిబంధనలను అతిక్రమించి పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు నడిపేవారు 5 వేల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. ప్రజారవాణా, స్థానిక అధికార వాహనాలకు మినహాయింపు నిచ్చిన గ్రీన్ ట్రైబ్యునల్, 2000 సీసీ, అంతకంటే ఎక్కువ ఉన్న డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలను ఇకపై రిజిస్టర్‌ చేయవద్దని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సీఎన్‌ జీ గ్యాస్‌ తో వాహనాలు నడపడంపై సమాచారం అందించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News