: చమురు ఉత్పత్తి పెరిగింది... ధరలు పడిపోయాయి
ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి. గత కొంత కాలంగా చమురు సరఫరా అధికంగా ఉండడంతో, అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన పోటీ కారణంగా చమురు ధరలు కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పోటీని తట్టుకునే లక్ష్యంతో ఉన్న ఇరాన్ చమురు ఉత్పత్తిని తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో ఆసియా మార్కెట్లలో చమురు ధరలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఒపెక్ దేశాలు జూన్ 2న వియన్నాలో సమావేశం కానున్నాయి. ఏప్రిల్ లో దోహాలో ఒపెక్ సభ్యదేశాలు సమావేశమైనా చమురు ఉత్పత్తిని తగ్గించడంలో విఫలమయ్యాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పటికీ , జూన్ 2014 ధరలతో పోల్చుకుంటే సగం మాత్రమే పెరగిన సంగతి తెలిసిందే.