: జూన్ 21 నుంచి పరిపాలన అంతా అమరావతి నుంచే!: మంత్రి చినరాజప్ప


జూన్ 21 నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే ఏపీ పరిపాలన వ్యవహారాలు జరుగుతాయని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలపు నిచ్చారు. ఈ నెల 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న ‘మహానాడు’ను జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా కాపుల గురించి కూడా ప్రస్తావించారు. కాపులను బీసీల్లో చేర్చే సత్తా సీఎం చంద్రబాబుకే ఉందన్నారు. వచ్చే నెల నుంచి కాపుల స్థితిగతులపై సర్వే ప్రారంభిస్తామని చినరాజప్ప పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News