: తమిళనాట జయలలిత మంత్రి వర్గం ఇదే...!


తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలిత ఆరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 32 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ, ఎంజీఆర్‌ తరువాత వరసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన జయలలిత మద్రాస్‌ యూనివర్సిటీ సెంటినరీ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, కేబినెట్ ను ప్రకటించారు. దీంతో ఆమె క్యాబినెట్‌ లోని కొత్త మంత్రులుగా 28 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శాఖల విషయానికి వస్తే, ముఖ్యమంత్రి జయలలిత... ప్రజావ్యవహారాలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, సాధారణ పాలన, జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, హోం శాఖలను తన వద్ద ఉంచుకున్నారు. ఇక మంత్రుల వివరాల్లోకి వెళ్తే... పనీర్‌ సెల్వం : ఆర్థికశాఖ; వ్యక్తిగత, పాలనా సంస్కరణలు దిండిగల్‌ శ్రీనివాసన్‌: అటవీ శాఖ ఎడప్పది కే పళనిస్వామి : జాతీయ రహదారులు, ప్రజా పనులు, చిన్న పోర్టులు సెల్లుర్‌ కే రాజు : సహకార, కార్మిక శాఖ తంగమణి : విద్యుత్తు, ఎక్సైజ్‌ వీపీ వేలుమణి : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, గ్రామీణాభివృద్ధి, ప్రత్యేక పథకాల అమలు కే జయకుమార్‌ : మత్స్య శాఖ షణ్ముగం : న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు కేపీ అంబజగన్‌ : ఉన్నత విద్య డాక్టర్‌ వీ సరోజ : సంక్షేమం, పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం కేసీ కరుప్పన్నన్‌ : పర్యావరణం ఎంసీ సంపత్‌ : పరిశ్రమలు ఆర్‌.కామరాజ్‌ : ఆహారం, పౌరసరఫరాలు, హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ ఓఎస్‌ మణియన్‌ : చేనేత, టెక్స్‌టైల్స్‌ ఉడుమలై రాధాకృష్ణన్‌ : పట్టణాభివృద్ధి, హౌసింగ్‌ సీ విజయభాస్కర్‌ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఎస్‌ పీ షణ్ముగనాథన్‌ : పాలు, డెయిరీల అభివృద్ధి ఆర్‌ దొరైకన్ను : వ్యవసాయ, పశుసంరక్షణ కదంబుర్‌ రాజు : సమాచారం, ప్రచారం ఆర్‌ బీ ఉదయ్‌ కుమార్‌ : రెవెన్యూ కేటీ రాజేంద్ర బాలాజీ : గ్రామీణ పరిశ్రమలు కేసీ వీరమణి : వాణిజ్య పన్నులు పీ బెంజమిన్‌ : పాఠశాల విద్య, క్రీడలు, యువజన సంక్షేమం వెల్లమండి ఎన్‌.నటరాజన్‌ : పర్యాటకం ఎస్‌.వలర్‌ మతి : వెనకబడిన వర్గాలు, మైనార్టీల సంక్షేమం వీఎం రాజలక్ష్మి : ఆదిద్రవిడార్‌, గిరిజన సంక్షేమం డాక్టర్‌ ఎం మణికందన్‌ : ఐటీ ఎంఆర్‌ విజయభాస్కర్‌ : రవాణా

  • Loading...

More Telugu News