: ఈ మ్యాజిక‌ల్ ప్లేట్ లో ఆహారాన్ని ఉంచితే చాలు.. కేల‌రీలను లాగేసుకుంటుంది


శ‌రీరంలో కేల‌రీలు పెరిగిపోకుండా జాగ్ర‌త్త‌గా ఆహారాన్ని ఎంపిక‌ చేసుకునే క్రమంలో అల‌సిపోతున్నారా..? అయితే మీకో శుభ‌వార్త‌. ఆహారంలోని క్యాల‌రీల‌ను పీల్చేసుకునేలా థాయి ప్ర‌భుత్వ హెల్త్ బోర్డ్ ఓ మ్యాజిక‌ల్ ప్లేట్ ను త‌యారు చేస్తోంది. ఈ ప్లేట్ 500 చిన్న‌ని రంద్రాల‌తో, ఆహారంలోని కేల‌రీలను గ్ర‌హించే విధంగా తయారుచేస్తున్నారు. దానిపై ఉంచిన‌ ఆహారంలోని ఏడు మిల్లీ లీట‌ర్ల ఆయిల్‌ను ఈ ప్లేట్ పీల్చేసుకుంటుంద‌ని థాయి హెల్త్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. దీని వ‌ల్ల‌ 30 కేల‌రీలు శ‌రీరంలో చేర‌కుండా చూసుకోవ‌చ్చ‌ని థాయి ప్ర‌భుత్వ హెల్త్ బోర్డ్ పేర్కొంది. దీంతో శ‌రీరంలో కేల‌రీలు పెరిగిపోతాయనే భ‌య‌మేమీ పెట్టుకోకుండా ఆహారాన్ని తీసుకోవ‌చ్చని చెబుతోంది. ఆహారంలోని జిడ్డులాంటి ప‌దార్థాన్ని పీల్చుకోవ‌డంలో ఈ ప్లేట్ ఓ స్పాంజీలా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది. ఆహారం తీసుకోబోయే ముందు ఈ ప్లేట్‌లో ఆహార ప‌దార్థాన్ని ఉంచితే చాల‌ని చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ ప్లేట్‌ తయారీ దశలో వుంది. ఇది గనుక మార్కెట్లోకి వ‌స్తే శ్ర‌మ‌ లేకుండానే శ‌రీరంలో కేల‌రీలు అధిక శాతంలో చేర‌కుండా చేసుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News