: అమరావతిని రెండో ఇల్లుగా భావించాలని వారికి చెప్పాను: సీఎం చంద్రబాబు


నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రెండో ఇల్లుగా భావించమని జపాన్ బృందానికి చెప్పానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబుతో జపాన్ బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి నిర్మాణ బాధ్యతలు జపాన్ ప్రభుత్వానివేనని, ఆ దేశానికి మాకీ సంస్థ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని భవనాల డిజైన్ జరగనుందని అన్నారు. డిజైన్ చేసిన మీరే నిర్మాణాల బాధ్యత తీసుకోవాలని జపాన్ బృందానికి బాబు సూచించారు. జపాన్ కు చెందిన వెయ్యి కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. ఈ ఏడాదిలో 150 జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News