: చాన్స్ కొట్టేసిన కరణ్ నాయర్, యుజ్వేంద్ర చహాల్ కూడా... జింబాబ్వే టూరుకు టెస్టు జట్టు ఇదే


ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటిన కరణ్ నాయర్, యజువేంద్ర చహాల్ భారత టెస్టు జట్టులో స్థానం పొందారు. జింబాబ్వేతో జరగనున్న టెస్టు జట్టుకు బీసీసీఐ జట్టును ఎంపిక చేయగా నాయర్, యజువేంద్రలతో పాటు మనీష్ పాండే, శార్థూల్ ఠాకూర్ లు కూడా ఎంపికయ్యారు. ఈ టూరులో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీ, రోహిత్, ధవన్ లకు వన్డే, టీ-20 పోటీల నుంచి రెస్టిచ్చిన బీసీసీఐ, రెండు జట్లనూ ప్రకటించింది. కాగా, జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 టీ-20 పోటీలను జింబాబ్వేతో ఆడే భారత్, నాలుగు టెస్టు మ్యాచ్ లను వెస్టిండీస్ తో ఆడనుంది. భారత జట్టు వివరాలు (వన్డే, టీ-20 మ్యాచ్ లకు- జింబాబ్వే): ఎంఎస్ ధోనీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫయాజ్ ఫైసల్, మనీష్ పాండే, కరణ్ నాయర్, అంబటి రాయుడు, రిషీ ధావన్, అక్సర్ పటేల్, జయంత్ యాదవ్, ధవల్ కులకర్ణి, జస్ ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్ దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనద్కత్, యజువేంద్ర చహాల్. టెస్టు పోటీలకు (వెస్టిండీస్ తో): విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాశుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సామీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, శార్థూల్ ఠాకూర్, స్టూవర్ట్ బిన్ని.

  • Loading...

More Telugu News