: సల్మాన్ చెల్లి కోరికను తీర్చిన ప్రియాంక
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ కోరికను సినీ నటి ప్రియాంకా చోప్రా తీర్చింది. ఆ వివరాలలోకి వెళితే, అర్పితా ఖాన్ చెల్లెలి భర్త ఆయుష్ శర్మకు 'డబ్ల్యూడబ్ల్యూఎఫ్' స్టార్ రాక్ (డ్వెన్ జాన్సన్) అంటే చాలా ఇష్టం. అతనిని ఎలాగైనా కలవాలని చాలా సార్లు అనుకున్నప్పటికీ కుదరలేదు. అయితే తాజాగా అతని సరసన 'బేవాచ్' సీరియల్ లో ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తన భర్త కోరిక తెలిసిన అర్పిత, తన భర్తను డ్వెన్ జాన్సన్ కు పరిచయం చేయాలని ప్రియాంకను కోరింది. ప్రియాంక అందుకు సరే అని వారిద్దరినీ న్యూయార్క్ రమ్మని పిలిచింది. 'బేవాచ్' షూట్ కు వారిద్దరినీ తీసుకెళ్లి వారిని పరిచయం చేసింది. దీంతో అర్పిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన భర్త కోరికతీర్చిన ప్రియాంకా చోప్రాకు ధన్యవాదాలు చెప్పింది. డ్వెన్ జాన్సన్ తమతో చాలా బాగా వ్యవహరించాడని పేర్కొంది.