: ఇక అధికారికం... ఐదు రోజుల పనిదినాలపై చంద్రబాబు సర్కారు జీవో జారీ


హైదరాబాద్ నుంచి అమరావతి ప్రాంతానికి వెళ్లి తాత్కాలిక రాజధాని వెలగపూడిలో పనిచేసే ఉద్యోగులకు ముందుకు అభయమిచ్చినట్టుగానే ఐదు రోజుల పని దినాలను అమలు చేసే దిశగా ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. వెలగపూడికి వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగుల తరలింపు దశలవారీగా ఉండబోదని తొలుత చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు మూడు దశల్లో ఉద్యోగులను తీసుకురానున్నట్టు పేర్కొంది. జూన్ 27కల్లా రావాల్సిన వారంతా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. కాగా, ప్రస్తుతానికి టెంపరరీ సెక్రటేరియట్ లో సీఎం ఆఫీసుతో పాటు మంత్రులు, సెక్రటరీ స్థాయి అధికారులకు మాత్రమే కార్యాలయాలుంటాయని, మిగిలిన వివిధ శాఖలకు విజయవాడ, గుంటూరుల్లో ఆఫీసులను కేటాయిస్తామని, ఈ పనులన్నీ కూడా జూన్ 27 కల్లా పూర్తవుతాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News