: క్రిష్-3 కథ నాది.. కాపీ కొట్టారు!: రాకేశ్ రోషన్‌పై కేసు పెట్టిన నవలా రచయిత
తాను రచించిన నవల 'సూఅర్దాన్' నుంచి కథను కాపీ కొట్టి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్-3 సినిమాను తీశారంటూ రచయిత రూప్ నారాయణ్ సోంకార్ చేసిన ఫిర్యాదుతో బాలీవుడ్ నిర్మాత రాకేశ్ రోషన్‌పై కేసు నమోదైంది. తన నవలలో మనిషి, జంతువు శారీరక లక్షణాలతో కొత్త ప్రాణికి ప్రాణంపోస్తూ దానికి మాన్వర్ అనే పేరు పెట్టానని, ఆ కథే క్రిష్-3లో ఉపయోగించారంటూ ఆయన పేర్కొన్నారు. ఎటువంటి అనుమతి తీసుకోకుండా తన కథను సినిమా నిర్మాత కొట్టేశాడని ఆయన ఆరోపించారు. రచయిత రూప్ నారాయణ్ సోంకార్ చేసిన ఫిర్యాదుతో నిర్మాత రాకేశ్ రోషన్‌పై కేసు నమోదు చేశామని ముంబయి పోలీసులు తెలిపారు.