: సింహానికి షేక్ హ్యాండ్ ఇద్దామనుకున్న వ్యక్తిపై కేసు నమోదు
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో నిన్న ముకేష్ అనే వ్యక్తి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి సాహసానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముకేష్ సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. అనంతరం అతడ్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి, పోలీసులు విచారణ జరిపారు. పోలీసులు ఈరోజు అతనిపై కేసునమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇతడు ఎల్ అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని మద్యం మత్తులో ఈ సాహసానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. నిన్న ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించిన ముకేష్ వైపుగా ఓ సింహం అడుగులు వేస్తుండడాన్ని గమనించిన సందర్శకులు పెద్దగా అరుస్తూ, శబ్దాలు చేయడంతో మృగరాజు వెనక్కి వెళ్లింది. దీంతో ముకేష్ కి ప్రమాదం తప్పింది.