: యువతకు తుపాకులతో శిక్షణ ఇస్తున్న బజరంగదళ్
ఉత్తరప్రదేశ్ లో యువతకు ఆయుధాలను వాడటంలో తర్ఫీదు ఇస్తున్న బజరంగదళ్ చిత్రాలు కలకలం రేపుతున్నాయి. 20 సంవత్సరాల లోపు యువకులకు తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హిందువుల స్వీయ రక్షణార్థం ఆయుధ శిక్షణ ఇస్తున్నట్టు కరుడుగట్టిన హిందూ మత సంస్థగా పేరున్న బజరంగదళ్ పేర్కొంది. తుపాకులు వాడటంతో పాటు కత్తి యుద్ధం, కర్రసాము వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నట్టు దళ్ నేత ఒకరు తెలిపారు. సుల్తాన్ పూర్ తో పాటు పిలిభిత్, నోయిడా, ఫతేపూర్ తదితర ప్రాంతాల్లో దళ్, ఇలాంటివే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి జూన్ 5 వరకూ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.