: తమిళ నాట మద్యం విక్రయాల సమయం తగ్గింది!... సంతకం చేసేసిన జయలలిత


తమిళ తంబీలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చర్యలు మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితం వరుసగా రెండో టెర్మ్ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన జయలలిత... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. రైతులకు రుణమాఫీ, విద్యుత్ సబ్సీడీలు తదితరాలపై సంతకం చేసేసిన జయలలిత... రాష్ట్రంలో మద్యం విక్రయాల సమయాన్ని కుదిస్తూ అధికారులు రూపొందించిన ఫైలుపై కూడా సంతకం చేశారు. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ కానున్న మద్యం షాపులు రాత్రి 10 గంటల దాకా మాత్రమే విక్రయాలు కొనసాగిస్తాయి.

  • Loading...

More Telugu News