: టీమిండియా కోచ్ పదవి కోసం దరఖాస్తులు
టీమిండియా కొత్త కోచ్ కోసం గత కొన్ని రోజులుగా బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పదవిని చేపట్టేందుకు దరఖాస్తులు చేసుకోవడానికి డెడ్ లైన్ జూన్ 10గా బీసీసీఐ నిర్ణయించింది. ఇంగ్లండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని కోచ్ ఎంపిక ఉంటుందని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్ స్టాఫ్ కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన టీమ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో, టీట్వంటీల్లో నం.2గా, వన్డేల్లో నం.4గా ఉందని ఆయన పేర్కొన్నారు. టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నం.1గా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రవిశాస్త్రి, బంగార్, అరుణ్, శ్రీధర్ లు టీమిండియా కోచ్‌లుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లకు కూడా కోచ్‌లను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.