: చివరి అంకానికి చేరుకున్న ఐపీఎల్-9 సీజన్.. రేపే తొలి క్వాలిఫయర్ మ్యాచ్
ఐపీఎల్-9 సీజన్‌లో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడడానికి నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌లో ఇకపై చివరి పోరాటం మాత్రమే కనపడనుంది. పంజాబ్, పూణె, ఢిల్లీ, ముంబయి టీమ్‌లు ఇంటికి వెళ్లగా.. గుజరాత్, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా టీమ్‌లు తుది మ్యాచుల్లో పాల్గొనబోతున్నాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా టీమ్‌లు వరసగా 18, 16, 16, 16 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఐపీఎల్-9లో రేపు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు- గుజరాత్ లయన్స్ రేపు తలపడనున్నాయి. దీనిలో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. అనంతరం ఎల్లుండి ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా వేదికగా హైదరాబాద్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. దీనిలో గెలిచిన జట్టు తొలిక్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు తొలిక్వాలిఫయర్‌లో గెలిచిన జట్టుతో తుది పోరులో తలపడుతుంది.