: రోడ్డును రన్ వేగా భావించిన ఇండిగో పైలెట్... క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం


ఆ పైలెట్ చేసిన తప్పిదానికి 100 మందికి పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసుండేవి. విమానాలు నడిపేటప్పుడు అత్యంత జాగురూకతతో ఉండాల్సిన పైలెట్ నిద్రమత్తులోనో లేక ఇంకేదో ఆలోచనతోనో ఉండి, రోడ్డును రన్ వేగా భావించిన ఘటన ఇది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళుతున్న ఇండిగో సర్వీస్ 6ఇ-237, జైపూర్ ఎయిర్ పోర్టును సమీపించింది. ప్రధాన రన్ వే కు బదులుగా, పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డుపై ల్యాండింగ్ అయ్యేలా దూసుకొచ్చింది. 900 అడుగుల ఎత్తులో, ఇంకో ఒకటిన్నర నిమిషంలో ల్యాండింగ్ అవుతుందనగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు దీన్ని గమనించారు. వెంటనే కాక్ పిట్ అలారంను మోగించి పైలెట్లను అలర్ట్ చేశారు. అప్పటికే భూమికి 700 అడుగుల ఎత్తులోకి విమానం వచ్చేసింది. ఆ సమయంలో రన్ వేపై ల్యాండింగ్ కు అనుమతించని అధికారులు, మరో రౌండ్ వేసి రావాలని పైలెట్ ను ఆదేశించారు. జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ఇండిగో, విచారణ జరిపించగా, ఆ సమయంలో కో పైలట్ నిద్రపోతున్నట్టు వెల్లడైంది. ప్రయాణికుల ప్రాణాలను గాల్లో నిలిపిన వారిద్దరినీ, విధుల నుంచి తొలగించినట్టు ఇండిగో పేర్కొంది.

  • Loading...

More Telugu News