: చంద్ర‌బాబు గారూ.. కేసీఆర్ అంటే మీకెందుకంత భ‌యం..?: ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరా


తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల‌కు నిర‌స‌న‌గా విజ‌య‌వాడ‌లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తోన్న ధ‌ర్నాలో ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ‘గోదావ‌రి, కృష్ణా డెల్టాల్లో తాగునీరు లేదు, గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు దాటే ప‌రిస్థితి ఏపీలో ఉంది’ అని ఆయన అన్నారు. ఏపీలో ఏర్ప‌డ్డ క‌ర‌వుపై, తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల‌పై చంద్ర‌బాబు నాయుడు ఇంత‌వ‌ర‌కూ నోరు తెర‌వలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ నిర్మిస్తోన్న పాల‌మూరు, డిండి ప్రాజెక్టులపై చంద్ర‌బాబు తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఆయన అన్నారు. ‘ముఖ్య‌మంత్రి గారూ.. మీ ఊళ్లో కూడా ఈరోజు తాగ‌డానికి నీళ్లు లేవు’ అని రఘువీరా అన్నారు. ‘ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డానికే ‘జ‌న్మ‌భూమి’ అని నినాదమిస్తోన్న మీ ప్ర‌భుత్వం పుట్టిన భూమికే అన్యాయం చేస్తోంది’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘పంట‌లెండిపోయాయ్‌, నీళ్లు క‌ర‌వైపోయాయ్.. కృష్ణా, తుంగ‌భ‌ద్ర మీద తెలంగాణ అక్ర‌మ నిర్మాణాలు చేస్తోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ప్ర‌జ‌లకి గుక్కెడు నీళ్లు కూడా అంద‌వ‌’ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ‘చంద్ర‌బాబు గారూ.. కేసీఆర్ అంటే ఎందుకంత భ‌యం..? నోటుకు ఓటు కేసుపై భ‌య‌ప‌డుతున్నారా.?, మీరు జైలుకు వెళతారని భావిస్తున్నారా..? అని ర‌ఘువీరా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News