: హైదరాబాద్ పరిస్థితి మనకొద్దంటూ జీవీఎంసీ కమిషనర్ కాళ్లు మొక్కి నిరసన!
అనుమతి లేని హోర్డింగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, విశాఖ వాసులు ఉద్యమించారు. రెండు రోజుల నాడు హైదరాబాద్ లో గాలికి విరిగిపడ్డ హోర్డింగులు, చెట్లను ప్రస్తావిస్తూ, విశాఖలో సైతం అనుమతి లేని హోర్డింగులు లెక్కకు మిక్కిలిగా ఏర్పాటయ్యాయని, వాటిని తొలగించాలని వినూత్న నిరసన తెలిపారు. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) చైర్మన్ కాళ్లు మొక్కి మరీ ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పెద్దఎత్తున గాలివీస్తే, కూలిపోయేలా ఉన్న ప్రాణాంతక హోర్డింగులను తక్షణం తీసేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న వారి విజ్ఞప్తికి కమిషనర్ ప్రవీణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.