: మంత్రి జూపల్లిని కలిసిన మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్
ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి ప్రత్యేక చర్చలు జరిపారు. తెలంగాణలో మహేష్ బాబు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా సిద్ధాపూర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకునేందుకే నమ్రత వచ్చినట్టు సమాచారం. గత నెల 29వ తేదీన నమ్రత స్వయంగా సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధికి పలు సలహా, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. గ్రామానికి రోడ్లు, డ్రయినేజ్, నీటి వసతి తదితరాంశాలపై మంత్రి జూపల్లితో నమ్రత చర్చించినట్టు అధికారులు తెలిపారు. కాగా, మహేష్ బాబు ఏపీలో తమ స్వగ్రామమైన బుర్రిపాలెంను కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.