: భారత కార్యకలాపాలకు గవర్నర్ ను ప్రకటించిన ఐఎస్ఐఎస్!


రెండు రోజుల క్రితం భారత ఉగ్రవాదులకు ర్యాంకులను ప్రకటించిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్, ఇండియాలో తమ పనులను పర్యవేక్షించేందుకు గవర్నర్ ను నియమించింది. కల్యాణ్ కు చెందిన ఫహాద్ తన్వీర్ షేక్, అమన్ నయీమ్ తాండల్ ల ఉగ్రకలాపాలను బయటి ప్రపంచానికి వీడియో రూపంలో చూపిన ఐఎస్ఐఎస్, ప్రస్తుతం అబూ బకర్ అల్-హిందీగా పేరు మార్చుకున్న తన్వీర్ కు నయీబ్ కలీఫా (డిప్యూటీ కాలిఫ్)గా ప్రమోషన్ ఇచ్చినట్టు వెల్లడించింది. 'హింద్ వాల్ సింథ్' ప్రాంతానికి అబూ ఉమర్ అల్-హిందీగా పేరు మార్చుకున్న అమన్ కు గవర్నర్ గా బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది. ఈ విషయంలో తమకు స్పష్టమైన సమాచారం అందిందని జాతీయ నిఘా వర్గాలు వెల్లడించాయి. కాశ్మీర్, గుజరాత్, యూపీలోని ముజఫర్ నగర్ లోని ముస్లిం యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఇటీవలి కాలంలో ఐఎస్ఐఎస్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రమోషన్లు పొందిన అమన్, ఫహాద్ లు పూర్తిగా ఉగ్ర సంప్రదాయవాదులుగా మారిపోయారని, వీరితో భారత్ కు ప్రమాదం పొంచివున్నట్టేనని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

  • Loading...

More Telugu News