: అబద్ధాలు చెబుతున్న హిల్లరీ క్లింటన్... చూసిన 70 లక్షల మంది, తిట్టిపోస్తున్న నెటిజన్లు!


డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు పరుగులు పెడుతున్న హిల్లరీ క్లింటన్ కు చెందిన వీడియో ఒకటి ఆన్ లైన్లో వైరల్ అవుతోంది. గతంలో ఓ మాట, ఆ తరువాతో మాట, ఆపై ఇంకోమాట... ఇలా వివిధ అంశాల్లో మాటలు మార్చుతున్న హిల్లరీకి చెందిన వీడియో ఇది. మొత్తం 13 నిమిషాల నిడివిగల వీడియోను ఇప్పటికే 70 లక్షల మందికి పైగా చూశారు. వాల్ స్ట్రీట్ అంశాలు, స్వలింగ సంపర్కుల వివాహం, ఎన్ఏఎఫ్టీయే (నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) తదితర అంశాల్లో ఆమె మాటలు మార్చి అబద్ధాలు చెప్పారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 2004కు ముందు నుంచి హిల్లరీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలకు సంబంధించిన కటింగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. స్వలింగ సంపర్కుల వివాహంపై తొలుత సంప్రదాయాలని చెప్పడం, ఆపై మద్దతివ్వాల్సిందేనని అనడం, స్వేచ్ఛా వాణిజ్యంపై మాట మార్చడం వంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. కాగా, ఈ వీడియో ట్రంప్ కు అనుకూలంగా విడుదల చేశామని భావించవద్దని, తమ తదుపరి టార్గెట్ ట్రంపేనని, ఆయనకు సంబంధించిన మరిన్ని అబద్ధాల వీడియో త్వరలో రానుందని దీన్ని పోస్ట్ చేసిన వారు పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News