: పులివెందులలో వైఎస్ జగన్... తాత రాజారెడ్డికి నివాళి అర్పించిన వైసీపీ అధినేత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి కడప జిల్లాలోని తన సొంతూరు పులివెందులకు వెళ్లారు. నేడు, రేపు ఆయన అక్కడే ఉంటారు. తన తాత వైఎస్ రాజారెడ్డి 18వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కొద్దిసేపటి క్రితం తాత సమాధి వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన జగన్... తాతకు నివాళి అర్పించారు.