: ఆర్ఎల్వీ- టీడీ ప్రయోగం సక్సెస్!... భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి!


భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి లాంటి విజయం నమోదైంది. కొద్దిసేపటి క్రితం ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (రీ యూజబుల్ లాంచ్ వెహికిల్- ఆర్ఎల్వీ) ప్రయోగం విజయవంతమైంది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కౌంట్ డౌన్ మొదలు కాగా... కొద్దిసేపటి క్రితం నిర్దేశిత సమయానికే ఆర్ఎల్వీ- టీడీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసింది. ధ్వని వేగం కంటే 5 రెట్ల వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లిన రాకెట్... 70 కిలో మీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి భూమికి చేరుకుంది. ఆ తర్వాత వెంటనే తన దిశ మార్చుకుని కిందకు దిగింది. బంగాళాఖాతంలోని జలాల్లో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన వర్చువల్ రన్ వేపై ఆర్ఎల్వీ- టీడీ దిగిపోయింది. ఈ మొత్తం ప్రయోగం కేవలం 11 నిమిషాల్లోనే పూర్తైపోయింది. ఆర్ఎల్వీ- టీడీ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరి సురక్షితంగా భూమికి చేరడంతో షార్ లో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News