: 27 నుంచి తిరుపతిలో టీడీపీ మహానాడు... పలు సమావేశాలు వాయిదా
తిరుపతిలో ఈ నెల 27 నుంచి టీడీపీ మహానాడు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో కలెక్టర్ల సమావేశం, 26న కేబినెట్ సమావేశం జరగాల్సి వున్నాయి. అయితే, కలెక్టర్ల సమావేశాన్ని 25, 26వ తేదీలకు మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. 26న జరగాల్సిన కేబినెట్ భేటీని మహానాడు తర్వాత నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.