: ఉన్నతవిద్యా పథకానికి తన పేరు పెట్టడంపై చంద్రబాబు కన్నెర్ర


ఉన్నత విద్యా పథకానికి తన పేరు పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇకపై పథకాలకు పేర్లు పెట్టే ముందు సీఎం కార్యాలయం అనుమతి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఒంగోలులో రెండు రోజుల క్రితం జరిగిన టీడీపీ మినీ మహానాడులో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలపై కూడా సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. మినీ మహానాడు సందర్భంగా గొట్టిపాటి, కరణం బలరామ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వరాదని సీఎం జిల్లా మంత్రిని, సీనియర్ నాయకులకు మార్గనిర్దేశం చేశారు. మినీ మహానాడులో చోటు చేసుకున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆదేశించారు.

  • Loading...

More Telugu News