: హైదరాబాదులో ఆటోవాలాల సమ్మె వాయిదా


రవాణా, పోలీసు అధికారుల వేధింపులకు నిరసనగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన ఆటో సంఘాలు వెనక్కి తగ్గాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె తలపెట్టిన ఆటో కార్మిక సంఘాలు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. పోలీసులు, రవాణా అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరిట తనిఖీల కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆటో సంఘాల సమ్మె ఉపసంహరణతో గ్రేటర్ వాసులకు కష్టాలు తప్పాయనుకోవచ్చు. ఒకవేళ సమ్మె మొదలైతే రోజూ ఆటోలనే నమ్ముకుంటున్న సుమారు ఎనిమిది లక్షల మంది రవాణాకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అయితే, ఆటోవాలాల సమ్మె పిలుపు నేపథ్యంలో అదనంగా సర్వీసులను తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు.

  • Loading...

More Telugu News