: ఎమ్మెల్సీ పుత్రుడి తుపాకీ తూటాలకు బలైన విద్యార్థికి 70% మార్కులు


ఆదిత్య సచ్ దేవ పేరు గుర్తిందిగా..? జేడీయూ పార్టీ ఎమ్మెల్సీ మనోరమ (ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు) కుమారుడి చేతిలో ఉత్తరప్రదేశ్ లోని గయలో అకారణంగా హత్యకు గురైన విద్యార్థి. సచ్ దేవకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో 70 శాతం మార్కులు వచ్చాయి. కానీ ఆ ఫలితాలు చూసి సంతోష పడేందుకు నేడు అతడు మన మధ్య లేడు. గయలో ఈ నెల 7వ తేదీన తన కారును ఓవర్ టేక్ (అధిగమించి) చేసి వెళ్లాడన్న కోపంతో కారులో ఉన్న ఎమ్మెల్సీ మనోరమ కుమారుడు రాకీ తన తుపాకీతో ఆదిత్య సచ్ దేవను కాల్చి చంపిన విషయం తెలిసిందే. సచ్ దేవ గయలోని నజరత్ అకాడమీలో సీబీఎస్ఈ పరీక్షలు రాశాడు. ఇంగ్లిష్ లో 72, హిందీలో 77, ఎకనమిక్స్ లో 56, బిజినెస్ స్టడీస్ లో 82 శాతం మార్కులు సాధించినట్టు తాజాగా వెల్లడైన ఫలితాల ద్వారా తెలిసింది. ఫలితాలు వెల్లడైన రోజు ఆదిత్య సచ్ దేవ తండ్రి సుందర్ సచ్ దేవ ను మీడియా కదిలించగా ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ రోజు తమకు ఆనందకరంగా ఉండాల్సిన రోజని, ఫలితాలు తమను మరోసారి కలచివేశాయన్నారు. ప్రస్తుతం రాకీతోపాటు అతని తల్లిదండ్రులు మనోరమాదేవి, బిండి గయ సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. రాకీ హత్యాభియోగాలను ఎదుర్కొంటుండగా, అతడికి ఆశ్రయం కల్పించిన అభియోగాలను బిండి ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీ నివాసం నుంచి మద్యం బాటిళ్లు లభించడంతో ఎక్సైజు నిబంధనల ఉల్లంఘన కింద ఆమె కేసు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News