: కన్న పిల్లలను దారుణంగా చంపేసిన కసాయి!


భార్యపై అనుమానం పెంచుకున్న ఓ దుర్మార్గపు తండ్రి ఇద్దరు కన్న పిల్లలను దారుణంగా చంపేశాడు. అభం శుభం తెలియని చిన్నారులను నీటిలో ముంచేసి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాదు, మరో చిన్నారినీ చంపేసేందుకు ప్రయత్నించాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలో ఈ దారుణం జరిగింది. ఇదే జిల్లా రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కు భార్య, ముగ్గురు పిల్లలు స్వాతి (10), మోక్ష (5), 13 నెలల బాబు ఉన్నారు. తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని చంద్రశేఖర్ కొన్నేళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. వివాహేతర సంబంధాల ద్వారానే పిల్లలను కన్నదంటూ తరచూ గొడవ కూడా చేసేవాడు. ఈ క్రమంలో పిల్లలను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఈతకు వెళదామని చెప్పి ముగ్గురు పిల్లలను తీసుకుని జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న నిజాం సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లాడు. స్వాతిని నీటిలో ముంచేశాడు, ఆమె పెనుగులాడడంతో బురదలో వేసి కాలుతో తొక్కి చంపేశాడు. మోక్షను కూడా నీటిలో ముంచి హత్య చేశాడు. మూడో సంతానమైన 13 నెలల బాబును కూడా నీటిలోకి విసిరేశాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న కొందరు స్థానికులు గమనించి చిన్నారిని రక్షించారు. చంద్రశేఖర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News