: ఈపీఎఫ్ఓ చందాదారులకు చవకగా ఇళ్లు


ఉద్యోగుల భవిష్య నిధి పథకం (ఈపీఎఫ్ఓ) చందాదారులకు తక్కువ ధరలో ఇళ్లను అందజేసే పథకాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ ట్రస్టు, లబ్ధిదారుడు, బ్యాంకు లేదా హౌజింగ్ ఏజెన్సీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదర్చాలని, భవిష్యత్తులో పీఎఫ్ కు చెల్లించబోయే సొమ్మును ఈఎంఐలుగా చెల్లించేలా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఈపీఎఫ్ఓ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న ట్రస్టీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News