: ఐఎస్ఐఎస్ పేరును పోలిన కారు నంబర్... యజమాని కోసం పోలీసుల ఆరా!!
తన కారు నంబర్ 1515 ను ఐఎస్ఐఎస్ పేరు గుర్తుకు వచ్చేలా రాయించుకున్న మారుతీ ఎర్టిగా యజమాని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్న ఘటన లక్నోలో చోటు చేసుకుంది. లక్నోలోని నిషాంత్ గంజ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద శుక్రవారం సాయంత్రం ఈ కారు పార్కు చేసి ఉంది. ఆ కారు నంబరు యూపీ 32 హెచ్ఏ 1515. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంక్షిప్త నామమైన ఐఎస్ఐఎస్ అక్షరాల మాదిరిగా ఆ నంబరును రాయించి.. ఆ నంబరు ప్లేట్ ను కారుకు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం నంబరు ప్లేట్ ఫ్యాన్సీగా ఉండటం కుదరదు. దీనికితోడు, ఆ నంబర్లను ఐఎస్ఐఎస్ అక్షరాల మాదిరిగా ఉండటంపై ఆరా తీస్తున్నామని, కారు యజమాని వివరాల కోసం సమాచారం సేకరిస్తున్నామని లక్నో ట్రాఫిక్ ఏఎస్పీ హబిబుల్ హసన్ తెలిపారు.