: ఆత్మహత్య చేసుకుందామని సింహాల బోనులోకి దిగితే... సింహాలే పోయాయి!


సింహాల బోనులోకి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోకపోగా, ఆ బోనులో ఉన్న సింహాలే మృతి చెందిన సంఘటన చిలీలోని ఒక జూలో జరిగింది. ఆఫ్రికా సింహాలను ఉంచిన ఒక బోనులోకి ఆత్మహత్య చేసుకోదలచిన ఒక వ్యక్తి దూకాడు. ఆ బోనులో పడిన కొద్ది సేపటి తర్వాత ఓ ఆడ సింహం, మగ సింహం అతనిపై దాడి చేశాయి. అయితే, ఈ సమాచారం తెలుసుకున్న జూ ప్రధాన అధికారి అల్ జండ్ర మోన్టల్వ అక్కడి భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేశాడు. మత్తు బాణాలతో వాటిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. చివరకు, గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండు సింహాలను కాల్చి చంపాల్సి వచ్చిందని ఆ అధికారి చెప్పారు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకే వాటిని కాల్చి చంపాల్సి వచ్చిందని, మృతి చెందిన సింహాలకు ఇరవై ఏళ్ల వయస్సు ఉంటుందని అన్నారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News