: బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సబబు కాదు: మంత్రి అయ్యన్నపాత్రుడు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి గురించి బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సబబు కాదని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. మినీ మహానాడులో అయ్యన్నపాత్రుడు సహా మంత్రులు గంటా, కొల్లు రవీంద్ర, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, దాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ఢిల్లీని మించిన రాజధానిని కడదామని ప్రధాని మోదీ చెప్పారని, ఆ హామీని ఆయన నిలబెట్టుకోవాలని కోరుతున్నామని అన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. గ్రేటర్ విశాఖలో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News