: అమెరికా వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చీఫ్ హతం
అమెరికా వాయుసేన జరిపిన దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ హతమయ్యాడు. ఈ మేరకు అమెరికా అధికారులు ఒక ప్రకటన చేశారు. పాకిస్థాన్ సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద మరో వ్యక్తితో కలిసి ముల్లా అక్తర్ వెళుతుండగా ఈ దాడి చేశామన్నారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ దాడి జరిగిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా, పెంటగాన్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సమాచారాన్ని పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాలకు తెలియజేసినట్లు వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముల్లా మహ్మద్ ఒమర్ అనంతరం 2015 జులైలో ముల్లా అక్తర్ మన్సూర్ తాలిబాన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాడు.