: ఇరాక్ లో ఆత్మాహుతి దాడి... ఏడుగురు మృతి
ఇరాక్ లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డట్టు ఇరాక్ అధికారులు పేర్కొన్నారు. దుజైల్ పట్టణంలోని సలాహుద్దీన్ సరిహద్దులో ఒక గుర్తుతెలియని దుండగుడు తన నడుముకు కట్టుకున్న బెల్టు బాంబును పేల్చేసుకోవడంతో ఈ దారుణం జరిగిందన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని అధికారులు పేర్కొన్నారు.