: జయలలిత సీఎంగా రేపు ప్రమాణస్వీకారం


తమిళనాడు సీఎంగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ కె.రోశయ్య ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా, శుక్రవారం జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆమె గవర్నర్ రోశయ్యను కలిసి, శాసనసభాపక్ష నేతగా తాను ఎన్నికైన తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. ఆ వెంటనే, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయలలితను రోశయ్య ఆహ్వానించారు. ఈ సందర్భంగా 28 మంది మంత్రుల పేర్లతో కూడిన జాబితాను గవర్నర్ కు జయలలిత అందజేశారు.

  • Loading...

More Telugu News