: నేడు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1, పేపర్-2 అనే విభాగాలుంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,618 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,73,494 మంది విద్యార్థులు ‘టెట్’ కు హాజరు కానున్నారు. టెట్ లో తొలిసారిగా బయోమెట్రిక్ విధానం ఈసారి అమలు చేయనున్నారు. అభ్యర్థుల ఫొటో, వేలిముద్రలను సేకరించనున్నారు. ఇక నిబంధనల విషయానికొస్తే, నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే పరీక్ష రాయాలని అధికారులు ఆదేశించారు. కాగా, ఈ నెల 23న టెట్ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తారు.