: చంద్రబాబు నడిచిన దారిలో పచ్చగడ్డి కూడా ఎండిపోతుందట!
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వినూత్నంగా ఒక హోమం నిర్వహించారు. ప్రజల బాధలు తెలుసుకోవడం కోసం 'వస్తున్నా మీకోసం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు 63 ఏళ్ల వయసులో 7నెలల పాటు సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర చేస్తున్నారు. అయితే, చంద్రబాబు నడచిన దారిలో పచ్చగడ్డి కూడా ఎండిపోయే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి అంటున్నారు. అందుకే బాబు యాత్రతో ప్రజలకు నష్టం కలగకుండా మంచి జరిగేందుకని ఆయన ఈ రోజు కాకినాడలోని ఆనందభారతి గ్రౌండ్స్ లో ప్రత్యేకంగా శాంతి హోమం నిర్వహించారు. ఉదయం ఇంద్రపాలెం వంతెన వద్ద పసుపు నీళ్లతో శుద్ది చేశారు.