: ఆకట్టుకున్న నితీశ్ రానా, రోహిత్, బట్లర్...గుజరాత్ లక్ష్యం 173
ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా కాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నితీశ్ రానా, రోహిత్ శర్మ, బట్లర్ ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ (30) శుభారంభం ఇవ్వగా, గుప్తిల్ (7) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రానా (70) ఆకట్టుకున్నాడు. క్రునాల్ పాండ్య (4) విఫలం కావడంతో జత కలిసిన బట్లర్ (33)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అనంతరం పొలార్డ్ (9), హార్డిక్ పాండ్య (7), హర్భజన్ సింగ్ (3) విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు 172 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, కులకర్ణి, బ్రావో, స్మిత్ చెరి రెండేసి వికెట్లు తీయడం విశేషం. 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ కు ఆదిలోనే వినయ్ కుమార్ షాకిచ్చాడు. తొలి ఓవర్ లో పరుగులేమీ ఇవ్వకుండానే ఆరోన్ ఫించ్ వికెట్ తీయడం విశేషం.