: ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' ఫస్ట్ లుక్ పై సంపూర్ణేష్ బాబు పంచ్


సంపూర్ణేష్ బాబు పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకుల పెదాలపై నవ్వు పుడుతుంది. వందల సినిమాలు చేస్తే కాని రాని ఫేమ్ ను ఒకే ఒక్క సినిమాతో సంపాదించుకున్న ఏకైక నటుడు సంపూర్ణేష్ బాబు. అలాంటి సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్...ఇచ్చట అన్నీ రిపేర్ చేయబడును' సినిమా ఫస్ట్ లుక్ పై పంచ్ డైలాగ్ వేశాడు. 'యమదొంగ' సినిమాలో జూనియర్ ఎన్టీర్ చెప్పిన 'సాఫ్ట్ గా ఉన్నాడు, సైడైపోతాడనుకున్నారా? లోపల ఒరిజనల్ అలాగే ఉంది' అన్న డైలాగ్ ను మార్చి...'సైడ్ యాంగిల్ లో ఉన్నాడు సైడైపోతాడనుకున్నారేమో... నేరుగా ఫేస్ చేసే దమ్ము వచ్చినప్పుడు విశ్వరూపమే' అంటూ పంచ్ డైలాగ్ వేశాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News