: అర్ధ సెంచరీలతో రాణించిన విజయ్, గురుకీరత్...పూణే లక్ష్యం 173
ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా రైజింగ్ పుణె సూపర్ జైయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (59), హసీమ్ ఆమ్లా (30) శుభారంభాన్నివ్వగా, వృద్ధిమాన్ సాహా (3) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గుర్కీరత్ సింగ్ మన్ (51) ఆకట్టుకున్నాడు. మిల్లర్ (7), బెహార్డీన్ (5), అక్షర్ పటేల్ (1) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. రిషి ధావన్ (11) మెరుపు సిక్సర్ కొట్టి పంజాబ్ కు భారీ స్కోరు అందించడంలో సహాయపడ్డాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 172 పరుగులు చేసింది. పూణే బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీయగా, అశోక్ దిండా, పెరీరా, ఆడమ్ జంపా చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.