: చెట్లు కూలి అసౌకర్యంగా ఉందంటూ సామాన్యుడిలా గవర్నర్ ఫిర్యాదు... వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్‌లో గాలివాన సృష్టించిన బీభత్సంతో రాజ్ భవన్ రోడ్డులో చెట్లు కూలి అసౌకర్యంగా ఉందంటూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన పేరు చెప్పకుండా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. అయినా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని కూలిన చెట్లను తొలగించారు. సామాన్యుడిలా తాను ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదు పట్ల జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించడంతో గవర్నర్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. 'శభాష్ జీహెచ్ఎంసీ' అంటూ సిబ్బందిని మెచ్చుకున్నారు. సామాన్యుల నుంచి వస్తోన్న ఫిర్యాదుల పట్ల జీహెచ్ఎంసీ మెరుగ్గా స్పందిస్తోందని ఆయన ప్రశంసించారు.