: పీసీబీ ఛైర్మన్ చిత్రమైన వ్యాఖ్య...చదువు లేకపోవడమే లోటు!


ఎక్కడో ఒకరిద్దరు మినహా చదువు అబ్బని వారే ఆటల్లో మెరుగ్గా రాణిస్తారన్నది జగమెరిగిన సత్యం. మరి పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఏమనుకున్నారో ఏమో కానీ...పాక్‌ జట్టు ఓటమికి కారణం జట్టులో పెద్ద చదువులు చదువుకున్న క్రికెటర్లు లేకపోవడమేనని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టులో మిస్బావుల్‌ హక్‌ తప్ప ఎవరూ కనీసం డిగ్రీ కూడా చదువుకోలేదని ఆయన చెప్పారు. అందుకే భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకున్న క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలిస్తామని ఆయన ప్రకటించారు. చదువుకున్న వారైతే తొందరగా ఆటలో నైపుణ్యం సాధిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అహ్మద్‌ షెహజాద్‌, ఉమర్‌ అక్మల్‌ లను తొలగించడం సరైన చర్యేనని పేర్కొన్న ఆయన, ఆటగాళ్ల క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్న పాక్ ఆటగాళ్లకి మిలటరీ తరహా శిక్షణ ఇస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News