: రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయిన మేరీ కోమ్
రియో ఒలింపిక్స్ కు క్వాలిఫయింగ్ రౌండ్లలోనే భారత మహిళా బాక్సింగ్ కు గట్టి దెబ్బ తగిలింది. రియో ఒలింపిక్స్-2016 అర్హత పోటీల్లో భారత మహిళా నెంబర్ వన్ బాక్సర్ మేరీ కోమ్ విఫలమైంది. మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీ రెండో రౌండ్ లోనే ఆమె ఓటమి పాలైంది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ తాజా ఒలింపిక్స్ కు అర్హత పోటీలోనే ఓడిపోవటం భారత బాక్సింగ్ కు పెద్ద దెబ్బేనని భావించవచ్చు.